గిద్దలూరు పట్టణంలో భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాహనదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారీ కంటైనర్, లారీ రావడంతో వాహనాలు చాలాసేపు నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. పట్టణంలో పెరుగుతున్న భారీ వాహనాల రాక, రోడ్ల వెడల్పు లేకపోవడం, అధిక వాహనాల రద్దీ వంటి కారణాలతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.