మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంలో జరుగుతున్న అవకతవకలపై గ్రామస్తులు మంగళవారం మధ్యాహ్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ దుకాణదారుడు ప్రజలకు ఇవ్వాల్సిన చక్కెర, బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ దందాపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.