101 కొబ్బరికాయలు కొట్టిన వైసీపీ నాయకులు

267చూసినవారు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు 101 కొబ్బరికాయలు కొట్టారు. ఇంచార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాలతో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉపయోగించారంటూ కూటమి నాయకులు చేసిన ఆరోపణలను చెన్నారెడ్డి ఖండించారు. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చిచెప్పిందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కూటమి నాయకులకు జ్ఞానోదయం కలిగించాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్