
ఘనంగా శివపార్వతుల కళ్యాణం
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కుటుంబంతో కలిసి హాజరై, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.




































