
ట్రాన్స్ఫార్మర్ల దొంగల ఆట కట్టించిన పోలీసులు
కనిగిరి నియోజకవర్గంలో 13 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, సుమారు 155 కిలోల రాగి తీగను అపహరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దొంగిలించిన రాగి తీగ, ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టడానికి ఉపయోగించిన పరికరాలు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. రైతుల ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు.





































