మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలంలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం యత్నానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు ఫోక్సో కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 5, 000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 75, 000 పరిహారం ద్వారా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో నేరం నిరూపితమై శిక్ష పడిందని జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. పిల్లలు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు.