మార్కాపురం జిల్లా కనిగిరి ఎన్జీవో హోంలో ఆదివారం ఏఐటీయూసీ 5వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ కార్మిక సంఘాలు బలోపేతం కావాలని, ఏప్రిల్ 8న జరగనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా పాలపర్తి మస్తాన్ రావు, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఖాసింపీరా, కోశాధికారిగా షేక్ నాసర్ వలి ఎన్నికయ్యారు.