మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో భీమ్ రామ్ జీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ను ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా కనిగిరిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కార్యాలయం పేర్కొంది.