శనివారం వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించమని స్వామిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.