వెలిగండ్ల సైడ్ కాలువల నిర్మాణానికి శ్రీకారం

0చూసినవారు
మార్కాపురం నియోజకవర్గంలోని వెలిగండ్ల గ్రామంలో సైడ్ కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిపూజా కార్యక్రమం గురువారంనిర్వహించి, కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణాల ద్వారా గ్రామంలో డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభించి, మురుగునీరు సక్రమంగా వెళ్లేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెలిగండ్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్