రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

1281చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మార్కాపురం జిల్లా పామూరు మండలం నుచ్చుపొద గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.