జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం పామూరు గ్రామంలోని గాంధీ విగ్రహానికి బిజెపి సీనియర్ నాయకులు కొండిశెట్టి వెంకట రమణయ్య, టిడిపి నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.