కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ యాదవ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సాధనకై ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆయన కనిగిరిలో బుధవారం ఆవిష్కరించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.