మార్కాపురం జిల్లా కనిగిరిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.