మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ తాహెర్ సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, తాహెర్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్తో పాటు స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.