ప్రకాశం జిల్లా కనిగిరి మర్రిపూడి గ్రామంలోని శ్రీ పృథులగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పాలకవర్గ సభ్యురాలిగా ఎన్నికైన గీతా సౌభాగ్య లక్ష్మి, శ్రీ శివరాజు శ్రీనివాసరావు దంపతులను సన్మానించారు. డా. మణి ఆధ్వర్యంలో శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ శింగంపల్లి సుబ్బారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మునగాల రమణకిషోర్, శ్రీ వెలగపూడి సురేష్ బాబు, శ్రీ తురిమెళ్ళ శాయిరామ్ లు కలిసి అభినందనలు తెలిపి సత్కరించారు.