మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం వి ఆర్ నగర్ కు చెందిన 17 ఏళ్ల బండారు మనోహర్ అనే మైనర్ బాలుడు ఈ నెల 21వ తేదీ నుంచి కనిపించడం లేదు. పాఠశాలకు వెళ్తానని చెప్పి బయటకు వెళ్లి పెన్ను కొని వస్తానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడి అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని గుర్తించినవారు 9121102215 నంబర్ లో పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.