కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మండల స్థాయి జీఎఫ్ఎల్ఎన్ మెరిట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుండే పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చల్ల గిరి గల, దిరిశవంచ, చింతలపాలెం, దేవాంగ నగర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మండల స్థాయిలో అర్హత సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపీడీవోతో పాటు ఎంఈఓ నారాయణరెడ్డి విద్యార్థులను అభినందించారు.