వెలిగండ్ల మండల వైసిపి సర్పంచులకు ఘన సన్మానం

610చూసినవారు
వెలిగండ్ల మండల వైసిపి సర్పంచులకు ఘన సన్మానం
వెలిగండ్ల మండలం పరిధిలోని 21 గ్రామ పంచాయతీలను వైసిపి గెలుచుకున్న సందర్భంగా, జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులకు ఆదివారం ఘనంగా సన్మానం నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైసిపి మండల చరిత్రలో ఇది ఒక గొప్ప విజయం అని, ఇదే స్ఫూర్తితో నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్