రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

1876చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ప్రకాశం జిల్లా పామూరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాసరి నాగరాజు భార్య నారాయణమ్మ మృతి చెందారు. కనిగిరి(మం) నేలటూరి గొల్లపల్లికి చెందిన దాసరి నాగరాజు తన పిల్లలతో వాహనంలో వెళ్తుండగా, పామూరు జాతీయ రహదారిపై టైరు పంచర్ అయింది. దీంతో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నారాయణమ్మ మృతి చెందగా, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్