ప్రకాశం జిల్లా పామూరు మండలం జంగాలపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం నాగమ్మ అనే వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును ఓ యువకుడు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఇంటి ఆవరణలో ఉన్న వృద్ధురాలి వద్దకు వెళ్లిన యువకుడు గొలుసును లాగగా, ఆమె కేకలు వేయడంతో స్థానికులు స్పందించి దొంగను పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.