
అదుపుతప్పి బోల్తాపడ్డ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
ప్రకాశం జిల్లా పామూరు మండలం తిరగులదిన్నె గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దుత్తలూరు నుండి పామూరుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




































