
నగదు జమ చేస్తానని మోసం
ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం కొత్తపల్లి కళ్యాణ్ అనే యువకుడు గుర్తుతెలియని వ్యక్తి చేతిలో మోసపోయాడు. ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్లిన కళ్యాణ్‌కు పరిచయమైన ఒక వ్యక్తి, సీడీఎం మిషన్ ద్వారా నగదు జమ చేయడంలో సహాయం చేస్తానని చెప్పి, అతని ఖాతాలో డబ్బు జమ చేసుకుని వెళ్లిపోయాడు. మోసం జరిగినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.




































