పొన్నలూరు పోలీసులు బుధవారం స్థానిక ప్రజలను డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తం చేశారు. పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయరని, ఎవరైనా అరెస్టు చేస్తున్నట్లు ఫోన్ చేస్తే నమ్మవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, గతంలో ఒక పోలీస్ అధికారికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని పోలీసులు తెలిపారు.