ఇప్పటి వరకు 1687 మందికి చెక్కులు పంపిణీ

407చూసినవారు
బుధవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 47 మందికి రూ. 55 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఇప్పటివరకు 1687 మందికి రూ. 13 కోట్లకు పైగా విలువైన చెక్కులు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్