గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి

256చూసినవారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక జింక మృతి చెందింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ ఘటనను గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మరణించిన జింకను వాహనంలో తరలించి దహన సంస్కారాలు నిర్వహిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీప అటవీ ప్రాంతం నుండి జింక రహదారిపైకి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్