మంత్రి స్వామి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

52చూసినవారు
మంత్రి స్వామి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామంలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఇంటింటికీ వెళ్లి పింఛనుదారులకు పింఛన్లు అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు యర్రంరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం, గ్రామంలో త్వరలో ఆవిష్కరించనున్న స్వర్గీయ ఎన్టీ రామారావు, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల వేదిక నిర్మాణ ఏర్పాట్లను మంత్రి పరిశీలించి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్