ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

338చూసినవారు
ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
నాల్గవ తరగతి నుండి ఐదవ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థుల కోసం నిర్వహించే డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రోత్సహించేందుకు, శనివారం సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, సహృదయ ఫౌండేషన్ సహకారంతో 4వ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జి. వీరమ్మ మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలు కోల్పోతున్నారని, ఇలాంటి కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు పునాది వేస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్