ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం సాయంత్రం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. టంగుటూరు మండలం తూర్పు రాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ఎస్పీ మంత్రికి పూల మొక్కను బహుకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి మంత్రి స్వామి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.