సింగరాయకొండలో ఘరానా దొంగ అరెస్ట్

413చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ రాఘవయ్య కాలనీలో మార్చి 13న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. చీమకుర్తికి చెందిన హరిబాబు అనే దొంగ అనిల్ ఇంట్లో 30 గ్రాముల బంగారం, 548 గ్రాముల వెండిని దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి, చోరీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్