ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని వెలుగు కార్యాలయాన్ని డీఆర్డీఏ పీడీ నారాయణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఈ నారి/సీఆర్పీల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలో శ్రీనిధి నిధుల దుర్వినియోగంపై ప్రాధమిక విచారణ చేపట్టారు. కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.