కొండపి: 'అలా చేస్తే బ్యార్నీ లైసెన్స్ రద్దు చేస్తాం

225చూసినవారు
కొండపి: 'అలా చేస్తే బ్యార్నీ లైసెన్స్ రద్దు చేస్తాం
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలంకేంద్ర నిర్వహణాధికారి సునీల్ కుమార్, వేలంకేంద్ర పరిధిలో బయట మార్కెట్లో పొగాకు విక్రయిస్తే రైతులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో అనధికారికంగా కొనుగోలు చేసినా, అమ్మినా రైతులపై చర్యలు తీసుకుంటామని, కొనుగోలు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. బయట మార్కెట్లో అమ్మిన రైతుల బ్యార్నీ లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్