ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వాహణాధికారి సునీల్ కుమార్, రైతులు పొగాకు నర్సరీ నుంచి నారు కొనుగోలు చేసిన రసీదులను తప్పనిసరిగా బోర్డులో సమర్పించాలని తెలిపారు. రసీదులు సమర్పిస్తేనే బేళ్లకు పట్టాలు ఇస్తామని, లేనిపక్షంలో పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రైతులు ముందుగానే నర్సరీల స్లిప్పులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.