విద్యుత్ షాక్ తో లైన్మెన్ కి తీవ్ర గాయాలు

1959చూసినవారు
విద్యుత్ షాక్ తో లైన్మెన్ కి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నందనవనంలో సోమవారం లైన్మెన్ ప్రసాద్ కు విద్యుత్ షాక్ తగిలింది. దావగూడూరు ఫీడర్ అనుకుని నందనవనం ఫీడర్పై లైన్ వర్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన భుజం, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ నందనవనం ఇన్ఛార్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్