ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని మూలగుంటపాడులో చిట్టీల పేరుతో కోట్లలో అప్పులు చేసి కనిపించకుండా పోయిన శ్రీనుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీను తన ఆస్తులన్నీ అమ్ముకొని అత్యంత గోప్యంగా వెళ్లిపోయినట్లు సమాచారం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.