ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో మంత్రి స్వామి బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించి, తీసుకోవలసిన చర్యలను తెలిపారు. వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సమస్యలపై దృష్టి సారించాలని, గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపరచాలని కార్యదర్శులకు సూచించారు.