ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో శనివారం గురుకుల పాఠశాలలకు మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. పాఠశాలల ప్రిన్సిపల్స్ కు మెడికల్ కిట్లు అందజేసి విద్యార్థుల ఆరోగ్యమే మనకు చాలా ముఖ్యమని తెలిపారు. స్వస్థ నారి స్వశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా మహిళలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందని మంత్రి స్వామి పేర్కొన్నారు.