ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం గ్రామంలో ఈనెల 7వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రామలక్ష్మమ్మ అనే మహిళ ఇంట్లోని బీరువా పగలగొట్టి 9 సవర్ల బంగారాన్ని దొంగిలించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిఎస్పి సత్యనారాయణ తెలిపారు.