రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆదివారం తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1.56 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని, పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్వామి అన్నారు.