ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని పలు రోడ్ల అభివృద్ధికి రూ. 22.61 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గతంలో ప్రయాణానికి అనువుగా లేని ఈ రోడ్ల పరిస్థితిని గమనించిన మంత్రి స్వామి, పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి రోడ్లకు మహర్దశ పట్టించారని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తయితే తమ ఇబ్బందులు తొలగిపోతాయని వారు తెలిపారు.