సింగరాయకొండ ఎస్సై మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలో శ్రీను అనే వ్యక్తి చిట్టీల పేరుతో ప్రజల వద్ద సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి, 26 మందిని మోసం చేసి పరారయ్యాడు. మొదట్లో నమ్మకంగా వ్యవహరించిన శ్రీను, తన ఆస్తులను అమ్మి డబ్బుతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.