ప్రకాశం జిల్లా కొండపి తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో గురువారం వీధి కుక్కలు అధిక సంఖ్యలో కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కార్యాలయానికి వచ్చినవారు కుక్కలను చూసి భయపడ్డారు. ఈ వీధి కుక్కల బెడదను తగ్గించాలని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.