సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన స్వామి

1419చూసినవారు
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, శనివారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 72 మందికి రూ. 46 లక్షలకు పైగా విలువచేసే చెక్కులను ఆయన అందజేశారు. రాష్ట్ర ఖజానాలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేశారని మంత్రి స్వామి తెలిపారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరాదని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్