ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం, కొత్తపాలెంలో సోమవారం రాత్రి రాములవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా జరిగిన ఈ కల్యాణం, గ్రామంలో మూడు రోజులుగా నెలకొన్న సందడి వాతావరణానికి ముగింపు పలికింది. నిర్వాహకుల ప్రకారం, రాములవారి కల్యాణంతో పాటు బొడ్రాయి, ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.