పాకాల సముద్ర తీరంలో పర్యాటకుల సందడి

194చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకుల సందడి నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు సముద్ర కెరటాల్లో స్నానాలు చేస్తూ, పిల్లలు ఇసుక తిన్నెలపై ఆడుకుంటూ ఆనందించారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెరైన్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్