ప్రకాశం జిల్లా కొండపి మండలం వెన్నూరు, చినవెంకన్నపాలెం, చోడవరం, ముప్పవరం గ్రామాలలో వేలం నిర్వహణ అధికారి సునీల్ ఆధ్వర్యంలో ఒంగోలు రీజనల్ ఇన్ఛార్జ్ మేనేజర్ సత్య శ్రీనివాస్ పలు కంపెనీ ప్రతినిధులతో పర్యటించారు. పొగాకు గ్రేడింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పొగ తోటలలో మల్లె వచ్చిన భూములల్లో మల్లెను పూతదశకు రాకముందే పీకివేసి పొలం బయట కాల్చివేయాలన్నారు.