ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని కోదండ రామస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి, హుండీని పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకులు ఈ దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో కలకలం రేగింది.