వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

487చూసినవారు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో గురువారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేలం నిర్వహణ అధికారి శంకర్రావు, చైర్మన్ యశ్వంత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 18 పొగాకు బేళ్లు రైతులు తీసుకురాగా, అవన్నీ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. గరిష్టంగా కేజీ రూ. 250 ధర పలుకుతున్నట్లు నిర్వహణ అధికారి వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కొనుగోళ్లు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్