ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఆదివారం పర్యటకుల తాకిడి నెలకొంది. సెలవు రోజు కావడంతో సేద తీరేందుకు భారీగా తరలివచ్చిన పర్యటకులను ఉద్దేశించి, అలల ఉధృతి దృష్ట్యా స్థానిక మెరైన్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పర్యటకులు సముద్రంలోకి మరింత లోపలికి వెళ్లకుండా, ఈత కొట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ, మైకు ద్వారా నిరంతరం హెచ్చరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.