రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

1568చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజోలుపాడు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నిపాడుకు చెందిన వెన్నపూస జయరామిరెడ్డి అల్లుడు అశోక్కు కాలు విరిగింది. అతనితో పాటు ఉన్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అశోక్ తన పిల్లలతో కలిసి టిఫిన్ కోసం అగ్రహారం వెళ్లి చెన్నిపాడు వస్తుండగా, కందుకూరు నుంచి వస్తున్న ఆటో రాజోలుపాడు వద్ద వీరి బైక్ ను ఢీకొంది. అశోక్ ను కందుకూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్